చెట్టుకు ఉరేసుకొని బాలికల మృతి ?

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లా, కొత్వాలి ప్రాంతంలోని గ్రామంలో ఒక చెట్టుకు వేలాడుతున్న 16, 14 ఏళ్ల వయసున్న బాలికల మృతదేహాలను స్థానికులు గుర్తించారు. కాంట్రాక్టర్‌ కుమారుడు, మేనల్లుడు వారిద్దరికి మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డారని ఇటుక బట్టీలో పని చేసే బాలికల కుటుంబం ఆరోపించింది. దీనిని వీడియో తీయడంతో అవమానం తట్టుకోలేక ఇద్దరు బాలికలు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు బాలికల మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాంట్రాక్టర్‌, 18 ఏళ్ల అతడి కుమారుడు, 19 ఏళ్ల మేనల్లుడ్ని అరెస్ట్‌ చేశారు. సామూహిక అత్యాచారం, ఆత్మహత్యకు ప్రేరేపించడం, పోక్సో చట్టం సెక్లన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్‌ ఫోన్లలో ఉన్న వీడియో క్లిప్స్‌ను పరిశీలిస్తున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. ఇటుక బట్టీకి సుమారు 400 మీటర్ల దూరంలోని చెట్టుకు వేలాడుతూ బాలికల మృతదేహాలు కనిపించాయని  పోలీసులు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)