టీ కప్పు,సన్ ఫ్లవర్,ఉదయించే సూర్యుడు గుర్తులు ఈసీకి ప్రతిపాదించిన శరద్ పవార్ వర్గం !

Telugu Lo Computer
0


జిత్ పవార్ వర్గంలోనే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండటంతో ఎన్సీపీ అజిత్ పవార్‌దే అని ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే, రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం శరద్ పవార్ వర్గం కొత్త పేర్లు, ఎన్నికల గుర్తులను సూచించాలని కోరింది. శరద్ పవార్ వర్గం మూడు పేర్లు, ఎన్నికల గుర్తులను సూచించినట్లు తెలుస్తోంది. 'శరద్ పవార్ కాంగ్రెస్', 'మి రాష్ట్రవాది', 'శరద్ స్వాభిమాని' అనే మూడు పేర్లతో పాటు 'టీ కప్పు', 'సన్ ఫ్లవర్', 'ఉదయించే సూర్యుడు' గుర్తులను ఈసీకి ప్రతిపాదించినట్లు సమాచారం. నిజమైన ఎన్సీపీ అజిత్ పవార్‌దే అని ఈసీ ప్రకటించి, ఎన్నికల చిహ్నం 'గడియారం'ని అజిత్ పవార్ వర్గానికే కేటాయించింది. ఈసీ నిర్ణయంపై అజిత్ పవార్ వర్గం సంబరాలు చేసుకుంటే.. శరద్ పవార్ వర్గం ఈ నిర్ణయాన్ని '' ప్రజాస్వామ్య హత్య'' అభివర్ణించింది. గతేడాది అజిత్ పవార్ ఎన్సీపీలో చీలక తీసుకువచ్చారు. ఆ తర్వాత శివసేన-బీజేపీ ప్రభుత్వంలో చేరారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవిని అజిత్ పవార్ తీసుకున్నారు. పలువురు ఎన్సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)