విశ్వాస పరీక్షలో పాల్గొనేందుకు హేమంత్ సోరెన్‌కు అనుమతి

Telugu Lo Computer
0


భూ కుంభకోనానికి సంబంధించిన మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్టు అయిన జార్ఖండ్ ముక్తి మోర్చ నాయకుడు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఫిబ్రవరి 5, 6 తేదీలలో రాష్ట్ర అసెంబ్లీలో జరిగే విశ్వాస పరీక్షలో పాల్గొనేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. అసెంబ్లీలో జరిగే విశ్వాస పరీక్షలో హేమంత్ సోరెన్ పాల్నొనేందుకు రాంచిలోని ప్రత్యేక కోర్టు శనివారం అనుమతి ఇచ్చింది. మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) బుధవారం అరెస్టు చేసింది. అంతకు కొద్ద గంటల ముందే ముఖ్యమంత్రి పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ముఖ్యమంత్రిగా జెఎంఎం సీనియర్ నాయకుడు చంపయి సోరెన్ నయమితులు కాగా జెఎంఎం సారథ్యంలోని కూటమి ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకోవడానికి గవర్నర్ 10 రోజుల గడువు విధించారు. దీంతో ఈ నెల 5, 6 తేదీలలో జరిగే విశ్వాస పరీక్షలో పాల్గొనేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రత్యేక పిఎంఎల్‌ఎ కోర్టులో దరఖాస్తు చేసుకోగా కోర్టు శనివారం అందుకు అనుమతించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)