'బకాయిల' విడుదల కోరుతూ మమతా బెనర్జీ ధర్నా!

Telugu Lo Computer
0


కేంద్రం నుంచి 'బకాయిల' విడుదల కోరుతూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధర్నా నిర్వహించారు. చలి గాలి వీస్తున్నా శుక్రవారం రాత్రి అంతా ఆమె ధర్నా కొనసాగించారు. శనివారం ఉదయం ఆమె కాలి నడకకు వెళ్లారు. కోల్‌కతా నడిబొడ్డున మైదాన్ ప్రాంతంలో బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు శుక్రవారం మధ్యాహ్నం తమ పార్టీ టిఎంసి నేతలతో పాటు మమత ధర్నా ప్రారంభించారు. ఆ ప్రదేశంలో రాత్రి అంతా గడిపిన మమత వెంట ఫిర్హాద్ హకీమ్, అరూప్ బిశ్వాస్ వంటి రాష్ట్ర మంత్రులు ఉన్నారు. ఉదయం ఆమె సమీపంలోని రెడ్ రోడ్‌లో కాలి నడకకు వెళ్లారు. ఆమె ఒక బాస్కెట్‌బాల్ మైదానాన్నీ సందర్శించారు. 'ఆ ప్రాంతం దట్టమైన పొగ మంచు కమ్ముకుంది. అటువంటి స్థితిలోనే మమత తన భద్రత గార్డులతో పాటు ఉదయం వ్యాహ్యాళికి వెళ్లారు. బాస్కెట్‌బాల్ మైదానంలో కొందరు క్రీడాకారులను చూసిన మమత ఆగి వారితో మాట్లాడారు.ఆ క్రీడ, బంతిపై అవగాహనకు ఆమె ప్రయత్నించారు' అని ఆమె వెంట ఉన్న టిఎంసి నేత ఒకరు చెప్పారు. ఎంజిఎన్‌రెగా, పిఎం ఆవాస్ యోజనతో సహా వివిధ సంక్షేమ పథకాల దృష్టా వేల కోట్ల రూపాయల మేరకు రాష్ట్రానికి కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం రావలసి ఉన్న బకాయిల కోసం మమత ఆందోళన నిర్వహిస్తున్నారు. ధర్నా ఆదివారం వరకు కొనసాగుతుంది. రాష్ట్ర బడ్జెట్ సెషన్ సోమవారం ప్రారంభం కానున్నది.

Post a Comment

0Comments

Post a Comment (0)