9 నుంచి 12వ తరగతి ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం పీఎం యశస్వి స్కాలర్ షిప్ !

Telugu Lo Computer
0


లహీన వర్గాల యువత కోసం భారత ప్రభుత్వం ఓ స్కాలర్‌షిప్ స్కీమ్ ను తీసుకొచ్చింది. దాని పేరే పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్‌షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రెంట్ ఇండియా. దీనిని పీఎం యశస్వీ స్కాలర్ షిప్ స్కీమ్ అని అంటారు. ఈ స్కాలర్‌షిప్ స్కీమ్ ద్వారా 9,10వ తరగతి విద్యార్థులకు ప్రతి ఏటా రూ.75 వేలు ఆర్థిక సహాయం, 11, 12వ తరగతి (ఇంటర్మీడియట్) విద్యార్థులకు ఏటా రూ.1.5 లక్షల ఆర్థిక సహాయం లభిస్తుంది. మెరిట్ ఆధారంగా 2023 సంవత్సరంలో ఈ స్కాలర్‌షిప్ కోసం విద్యార్థులను ఎంపిక చేశారు. దీనికి కోసం పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. పీఎం యశస్వీ స్కాలర్‌షిప్‌ను వెనుకబడిన తరగతి, ఆర్థికంగా వెనుకబడిన తరగతి, సంచార, పాక్షిక-సంచార జాతులు, డీనోటిఫైడ్ తెగలకు చెందిన 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు ప్రతిభావంతులైన విద్యార్థులు పొందవచ్చు. ఇందుకు కుటుంబ వార్షికాదాయం రూ. 2.5 లక్షల లోపు ఉండాలి. స్కాలర్‌షిప్ నేరుగా బ్యాంకు ఖాతాకు బదిలీ చేయబడుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)