బ్రిడ్జిని ఢీకొట్టిన పడవ : ముక్కలైన వంతెన

Telugu Lo Computer
0


క్షిణ చైనా నగరమైన గ్వాంగ్‌జౌలోని నాన్షా జిల్లాలో ఫిబ్రవరి 22న ఓ పడవ బ్రిడ్జిని ఢీకొట్టింది. ఈ ఘటనలో వంతెన ముక్కలైంది. దీంతో పలు వాహనాలు పెర్ల్‌ నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ముగ్గురు గల్లంతయ్యారు. ఫోషన్‌ నుంచి వచ్చి గ్వాంగ్‌జౌ వైపు ప్రయాణిస్తున్న ఓడ గ్వాంగ్‌జౌలోని లిక్సిన్‌ సీ బ్రిడ్జిని కార్గోషిప్‌ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బ్రిడ్జి మధ్యలో కూలింది. దీంతో బస్సుతోసహా ఐదు వాహనాలు నదిలోకి పడిపోయాయి. ప్రమాదానికి కారణమైన ఓడలో ఎలాంటి సరుకులు లేవు. ఓడ కూడా వంతెన కింద ఇరుక్కుపోయింది. ఇక ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న చైనా సెంట్రల్ టెలివిజన్(సీసీటీవీ)లో రికార్డయ్యాయి. ప్రమాదానికి కారణమైన ఓడ కెప్టెన్‌తోపాటు ఓడను కూడా గ్వాంగ్‌జౌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు లిక్సి్‌న్‌ సీ బ్రిడ్జి పక్కన నివసించే ప్రజలను పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రమాదాలు జరగకుండా వంతెనను పునర్నిర్మించాలని 2021లోనే ప్రావిన్షియల్ అధికారులు ప్రతిపాదించారు. బ్రిడ్జి పునరుద్ధరణ పనులు మూడుసార్లు వాయిదా పడినట్లు చైనా మీడియా వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)