బీబీసీ చైర్మన్‌గా సమీర్‌ !

Telugu Lo Computer
0


బీబీసీ చైర్మన్‌గా సమీర్‌ నియమితుడైయ్యాడు. ఈయన మహారాష్ట్ర లోని ఔరంగాబాద్‌లో జన్మించారు. తర్వాత 1960లో బ్రిటన్‌కు వలస వెళ్లారు. టీవీ ప్రొడక్షన్, పాత్రికేయరంగంలో నాలుగు దశాబ్దాల అనుభవం గడించిన సమీర్‌ గతంలో బీబీసీ నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా సేవలందించారు. బీబీసీలో సమకాలీన, రాజకీయ వ్యవహారాల విభాగం చీఫ్‌గానూ పని చేశారు. బ్రిటన్‌ రాజు చార్లెస్‌-3 ఈ వారమే సంబంధిత ఎంపిక ప్రక్రియకు ఆమోదముద్ర వేయడంతో ఫిబ్రవరి 22వ తేదీ ఆయన నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. మార్చి నాలుగో తేదీ నుంచి నాలుగు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగే సమీర్‌ దాదాపు రూ.1.68 కోట్ల వార్షిక వేతనం అందుకోనున్నారు. బ్రిటన్‌ టెలివిజన్‌ రంగానికి చేసిన విశేష కృషికిగాను 2019లో దివంగత బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 సమీర్‌ను కమాండర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌తో సత్కరించారు. 1998 నుంచి సొంతంగా జ్యూపిటర్‌ టీవీని ఈయన నడుపుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)