గగన్ యాన్ కు వెళ్లే నలుగురు వ్యోమగాముల పేర్లు ప్రకటన !

Telugu Lo Computer
0


గన్ యాన్ ప్రయోగం కోసం ఇస్రో ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాముల్లో గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా ఉన్నారు. ఈ నలుగురిని గగన్ యాన్ ప్రయోగంలో భాగంగా అంతరిక్షానికి పంపనున్నట్లు ఇస్రో ఇవాళ వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా వీరికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నలుగురిని ప్రధాని మోడీ ఇవాళ స్వయంగా కలిసి అభినందించారు. 2019 జూన్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఈ నలుగురు వ్యోమగాములకు శిక్షణ ఇచ్చేందుకు ఇస్రో, రష్యా అంతరిక్ష సంస్ధ రాస్ కాస్మోస్ అనుబంధ సంస్ధ అయిన గ్లావ్ కాస్మోస్ తో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం నలుగురు వ్యోమగాములు రష్యాలోని యూరి గగారిన్ కాస్మోనాట్ శిక్షణా కేంద్రంలో ఫిబ్రవరి 2020 నుండి మార్చి 2021 వరకు శిక్షణ పొందారు. మరోవైపు అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా కూడా 2024 చివరి నాటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మిషన్ కోసం భారతీయ వ్యోమగామికి శిక్షణ ఇస్తుంది. గగన్‌యాన్ మూడు  రోజుల మిషన్ కోసం వ్యోమగాములను భూమికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ద్వారా భారతదేశ మానవ అంతరిక్ష ప్రయాణ సామర్థ్యాన్ని చాటి చెప్పనుంది. ఆ తర్వాత భారత సముద్ర జలాల్లో ల్యాండింగ్‌తో వాటిని సురక్షితంగా భూమిపైకి తీసుకురానున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)