ఆంధ్రప్రదేశ్ లో 'బర్డ్ ఫ్లూ' కలకలం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ తీవ్ర కలకలం రేపుతుంది. వైరస్ కారణంగా జిల్లాలోని పొదలకూరు, కోవూరు మండలాల్లో భారీగా కోళ్ల మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. సమాచారం అందుకున్న జిల్లా అధికార యంత్రాంగాం కోళ్ల శాంపిల్స్ తీసుకొని భోపాల్ ల్యాప్ కి పంపించారు. తాజాగా రిపోర్ట్స్ లో కోళ్ల మృతికి కారణం బర్డ్ ఫ్లూ నే కారణం అని అధికారులు నిర్దారించారు.  నెల్లూరులో కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ అని తెలియగానే ప్రజలు భయాంతోళనకు గురి అయ్యారు. ఈ విషయంపై పశుసంవర్ధక శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ శుక్రవారం అత్యవసర భేటీ ఏర్పాటు చేసి ఈ వైరస్ ఇతర ప్రదేశాలకు వ్యాపించకుండా తక్షణమే జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే కీలక నిర్ణయం తీసుకున్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోయిన కోళ్లకు దాదాపు కిలో మీటర్ దూరంలో మూడు నెలల వరకు చికెన్ షాపులు మూసి వేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైరస్ ని అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)