మూడవ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 8.4% !

Telugu Lo Computer
0


ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ 8.4 శాతం వృద్ధి నమోదు చేసింది. తయారీ, మైనింగ్‌, నిర్మాణరంగాలు పుంజుకోవడంతో ఇది సాధ్యమైంది. ఈ మేరకు కేంద్ర గణాంక కార్యాలయం గురువారం సంబంధిత గణాంకాలను వెల్లడించింది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో అంచనాలను గణాంక కార్యాలయం వెలువరించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను జనవరిలో 7.3 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది. తాజాగా దాన్ని 7.6 శాతానికి సవరించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)