చర్చిలో 500 ఏళ్ల నాటి మొసలి మృతదేహం !

Telugu Lo Computer
0


టలీలోని లొంబార్డీ ప్రాంతంలో శాంటూరియో డెల్లా బీటా వర్జిన్ మరియా డెల్లె గ్రాజీ అనే 13వ శతాబ్దానికి చెందిన చర్చి ఉంది. ఈ చర్చిలో మొసలి మృతదేహం వేలాడుతోంది. మొసలి మృత దేహం ఎలా వచ్చిందో వివరాలు తెలియదు. ఈ మొసలి వెనుక అనేక కథనాలు, ఇతిహాసాలు అక్కడి చుట్టూ పక్కల ప్రాంతాల్లో ప్రచారంలో ఉన్నాయి. వాటిలో రెండు కథలు ఎక్కువ ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ ఇద్దరు సోదరులు ఫ్రాన్సిస్కో గొంజగాలోని ఒక ప్రైవేట్ జంతుప్రదర్శనశాల నుండి తప్పించుకున్న మొసలిని పట్టుకుని చంపినట్లు కొందరు నమ్ముతారు. మరికొందరు  మిన్సియో నది ఒడ్డున విశ్రాంతి తీసుకుంటున్న ఇద్దరు సోదరులపై మొసలి దాడి చేసిందని, అయితే, వారు దైవానుగ్రహంతో మొసలిని చంపారని చెబుతారు. ఇలాంటి అనేక కథలు ఈ చర్చి చుట్టుపక్కల బాగా ప్రచారంలో ఉన్నాయి. ఏది నిజం అనేది మాత్రం తెలియదు. కానీ, చర్చిలో ఈ మొసలి ఆకర్షణీయంగా ఉందనే వార్త మాత్రం వైరల్ గా మారింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)