నాలుగో టెస్టులో 353 పరుగులకు ఇంగ్లండ్‌ ఆలౌట్‌ !

Telugu Lo Computer
0


రాంఛీ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్‌ జట్టు 353 పరుగులకు ఆలౌటైంది. 302/7 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన స్టోక్స్‌ సేన అదనంగా 51 పరుగులు చేసి ఆలౌటైంది. భారత ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా స్పిన్‌ మయాజాలంలో ఇంగ్లండ్‌ బ్యాటర్లు చిక్కుకున్నారు. ఆఖరి మూడు వికెట్లను కూడా జడ్డూనే పడగొట్టాడు. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో జో రూట్‌ (122 నాటౌట్‌) అద్భుత శతకంతో చెలరేగగా, బెన్‌ ఫోక్స్‌(47), ఓలీ రాబిన్సన్‌(58) పరుగులతో రాణించారు. ఇక భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4 వికెట్లు పడగొట్టగా, ఆకాష్‌ దీప్‌ 3, సిరాజ్‌ 2, అశ్విన్‌ ఒక్క వికెట్‌ సాధించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)