యూట్యూబ్, సాఫ్ట్‌వేర్ ఉపయోగించి 500కి పైగా కార్ల దొంగతనం ?

Telugu Lo Computer
0


ఐదో తరగతి చదువుకుని, ఆటో రిక్షా తొక్కుతూ జీవనం సాగించే వ్యక్తి కార్ల దొంగతనాల కోసం పెద్ద ముఠానే ఏర్పాటు చేసుకున్నాడు. లగ్జరీ కార్లను దొంగతనం చేసేందుకు యూట్యూబ్, సాఫ్ట్‌వేర్ సాయంతో 500కి పైగా కార్లను దొంగతనం చేశారు. నిరక్షరాస్యులైనప్పటికీ.. యూట్యూబ్‌లో కార్ల దొంగతనం ఎలా చేయాలో నేర్చుకుని అమలు చేశారు. తాజ్ మహ్మద్ అనే వ్యక్తి తొలిసారిగా రౌనక్ అలీ అలియాస్ బాబుతో పరిచయం పెంచుకున్నాడు. వీరిద్దరు రింకూ, హకీమ్ అనే మరో ఇద్దరిని కలుసుకుని ఒక ముఠాగా ఏర్పడి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కార్లను దొంగతనం చేయడం ప్రారంభించారు. చాలాసార్లు జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఆ తర్వాత తాజ్ గుడ్డు, కాషిఫ్, మతీన్‌తో ముఠాను విస్తరించాడు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్ పోలీసులు ముస్సోరిలో ఈ ముఠా సభ్యుల్ని అరెస్ట్ చేశారు. వీరికి దుబాయ్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లు తేలింది. కార్లను అన్‌లాక్ చేయడానికి హైటెక్ సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించారు. దొంగలించిన కార్లను వీరు సంభాల్‌లోని అమీర్ అనే వ్యక్తికి సరఫరా చేసేవారు. అతను కార్లను వడోదరలోని వ్యక్తికి పంపిణీ చేసేవాడు. యాంటీ థెఫ్ట్ వ్యవస్థ ఉన్న కార్లను దొంగిలించేందుకు టాబ్లెట్లలో సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అమీర్, అతని భార్య కూడా దొంగతనంలో భాగస్వామిగా తేలింది. కార్ల దొంగతనానికి సంబంధించిన టూల్స్, రిమోట్ కాంట్రోల్డ్ కార్ కీలను సరఫరా చేసినట్లు ఏసీపీ అజిత్ కుమార్ చెప్పారు. కార్లకు డిమాండ్ ఉన్నప్పుడు మాత్రమే తాము దొంగతనం చేస్తున్నట్లు నిందితులు పోలీసులకు తెలిపారు. గడ్డూ, మతీన్, కాషిఫ్ కారును గుర్తించేందుకు రెక్కీ నిర్వహించేవారని, కారులోకి ప్రవేశించేందుకు కారు విండోను పగలగొట్టేవారని, టాబ్లెట్‌లో డౌన్‌లోడ్ చేసిని సాఫ్ట్‌వేర్ సాయంతో డూప్లికేట్ కీని తయారు చేసేవారని పోలీసులు తెలిపారు. స్టీరింగ్ లాక్ బ్రేక్ చేసేందుకు మాగ్నెట్స్ వాడేవారన్నారు. జీపీఎస్ ట్రాకర్లను తొలగించేందుకు మాగ్నెట్లను వాడారు. కార్ టెక్నాలజీ మారితే, వీరు దొంగిలించే పద్ధతుల్ని కూడా మార్చేవారు. దొంగలు తమ ఫోన్లను ఫ్లైట్ టైమ్‌లో ఉంచి, ట్రాక్ చేయబడటం లేదని నిర్ధారించుకునేందుకు లొకేషన్ డిసెబుల్ చేసేవారు. నేరం చేస్తున్న సమయంలో నార్మల్ కాల్స్ ఉపయోగించకుండా వాట్సాప్ కాల్స్ ఉపయోగించే వారమని దొంగలు చెప్పారు. ఇలా నేరం చేయడం ద్వారా వచ్చిన డబ్బుని సమానంగా పంచుకునే వారని పోలీసులు వెల్లడించారు. అమీర్‌కి దుబాయ్‌తో లింకులు ఉన్నట్లు తేలింది. కార్ డూప్లికేట్ కీలను రూపొందించడానికి తరుచూ దుబాయ్ వెళ్తున్నట్లు తేలింది. దొంగల నుంచి రెండు మారుతీ విటారా బ్రెజ్జా, ఒక బొలెనో, హోండా జాజ్, హ్యుందాయ్ శాంట్రోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్క్రూడ్రైవర్లు, సుత్తిలు, టాబ్లెట్లు తేలింది. నిందితులు ఢిల్లీలోని రోహిణిలోని ఏటీఎంలో కూడా డబ్బు దొంగిలించినట్లు తేలింది.

Post a Comment

0Comments

Post a Comment (0)