షిండే శివసేన వర్గంలో మిలింద్ దేవరా చేరిక !

Telugu Lo Computer
0


హారాష్ట్రలో కీలక కాంగ్రెస్ నేత మిలింద్ దేవరా నిన్న తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఈరోజు మహారాష్ట్ర సీఎం షిండేను కలిసి శివసేన పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో సీఎం ఏక్‌నాథ్ షిండే పార్టీ జెండాను అందజేసి శివసేన సభ్యత్వం అందించారు. దీంతోపాటు ముంబయికి చెందిన పలువురు కూడా శివసేనలో జాయిన్ అయ్యారు.  47 ఏళ్ల మిలింద్ దేవరా ఆదివారం (జనవరి 14) తన కుటుంబానికి కాంగ్రెస్‌తో 55 ఏళ్ల బంధాన్ని ముగిస్తున్నట్లు ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. ఈ రోజు నా రాజకీయ ప్రయాణంలో ఒక ముఖ్యమైన అధ్యాయం ముగిసింది. నేను భారత జాతీయ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసాను. పార్టీతో నా కుటుంబానికి 55 ఏళ్ల బంధానికి ముగింపు పలికాను. తనకు గత అనేక సంవత్సరాలుగా తిరుగులేని మద్దతు ఇచ్చిన నాయకులు, సహచరులు, కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)