ఢిల్లీ ఇండస్ట్రియల్‌ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం

Telugu Lo Computer
0


ఢిల్లీలోని బావ్‌నా ఇండస్ట్రియల్‌ ఏరియాలోగల ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీ నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో 29 ఫైరింజన్‌ల సాయంతో ఆర్పేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు. మంటలు అదుపులోకి వచ్చాయని ఈ ప్రమాదంలో ఆస్తి నష్టమే తప్ప ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)