సంక్రాంతి వేడుకల్లో సంప్రదాయ వస్త్రాధరణలో ప్రధాని మోడీ !

Telugu Lo Computer
0


ఢిల్లీలోని కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్ నివాసంలో సంక్రాంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకులకు ప్రధాని నరేంద్ర మోడీ సంప్రదాయ వస్త్రాధారణలో హాజరయ్యారు. పంచె, చొక్కా, కండువాను ధరించి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ పండుగ ప్రజలందరికీ సుఖశాంతులు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.  గోమాతకు పూలదండ వేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన అందరికీ పొంగల్ శుభకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్‌లు తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో తమిళ సంప్రదాయాలకు అనుగుణంగా ప్రధాని మోడీ పంచెకట్టులో రావడం ఆకట్టుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)