హేమంత్‌ సోరెన్‌కు మరోసారి ఈడీ సమన్లు !

Telugu Lo Computer
0

ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి, జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌కు భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌  మరోసారి సమన్లు జారీ చేసింది. జనవరి 29 లేదా 31 తేదీల్లో అందుబాటులో ఉండాలని కోరుతూ ఈ మేరకు స్పందన తెలియజేయాలని పేర్కొంది. ఇంతకుముందు జారీ చేసిన నోటీసుల్లో జనవరి 27 నుంచి 31 లోపు ఏదైనా ఒకరోజు విచారణకు హాజరయ్యేలా ఈడీ అవకాశం కల్పించింది. అయితే, ఎలాంటి సమాచారం లేకపోవడంతో తాజాగా మరోసారి ఆ తేదీలను కుదిస్తూ సమన్లు జారీ చేసినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈ కేసు విచారణలో భాగంగా చివరిసారిగా జనవరి 20న హేమంత్‌ సోరెన్‌ నివాసానికి వెళ్లిన ఈడీ అధికారులు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. రాత్రి 8.30 గంటల వరకు సుదీర్ఘంగా ప్రశ్నించారు. అనంతరం సోరెన్‌ మాట్లాడుతూ.. తనపై భారీ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇలాంటి కేసులకు భయపడే ప్రసక్తే లేదని, ధైర్యంగా ఎదుర్కొంటానని చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)