క్షిపణి దాడికి గురైన బ్రిటిష్ చమురు ట్యాంకర్‌ !

Telugu Lo Computer
0


గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో జనవరి 26 రాత్రి బ్రిటిష్ చమురు ట్యాంకర్ ఎంవీ మార్లిన్ లువాండాపై హౌతీలు క్షిపణులతో దాడి చేశారు. దీంతో ఆ ట్యాంకర్‌ షిప్‌లో మంటలు చెలరేగాయి. అందులో 22 మంది భారతీయ, ఒకరు బంగ్లాదేశ్‌ సిబ్బంది ఉన్నారు. కాగా, బ్రిటిష్ చమురు ట్యాంకర్ ఎంవీ మార్లిన్ లువాండా అత్యవసర ఎస్‌ఓఎస్‌ సందేశం పంపింది. భారత నౌకాదళం దీనికి స్పందించి, సహాయం, రెస్క్యూ కోసం గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం యుద్ధ నౌకను ఆ షిప్‌ వద్దకు పంపింది. నౌకా బృందాలు మంటలను ఆర్పేందుకు, అందులోని సిబ్బందిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఇండియన్‌ నేవీ తెలిపింది. దాడుల నుంచి కార్గో షిప్‌లను రక్షించేందుకు భారతీయ నౌకాదళం కట్టుబడి ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)