రైలులో ప్రయాణికుడిపై టీటీ భౌతిక దాడి !

Telugu Lo Computer
0

రౌనీ-లక్నో ఎక్స్‌ప్రెస్‌ రైలులో టీటీ రెచ్చిపోయి  రైలు ప్రయాణికుడిపై భౌతిక దాడికి దిగాడు. రైలులో 25 ఏళ్ల యువకుడు టికెట్‌తో రైలు నంబరు-15203లో ముజఫర్‌పూర్‌ నుంచి లక్నోకు ప్రయాణిస్తుండగా టీటీ దాడికి దిగాడు. ప్రయాణికుడి చెంపపై పలుమార్లు కొట్టాడు. అసలు ఎందుకు దాడి చేశాడు అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. కాగా, ప్రయాణికుడు నీరజ్‌ కుమార్‌ టికెట్‌ కూడా తీసుకోవడం గమనార్హం. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, టీటీ చర్యపై నెటిజన్లతో సహా కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో లక్నో డివిజన్‌ డీఆర్‌ఎం టీటీని సస్పెండ్‌ చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు సమాచారం. 

Post a Comment

0Comments

Post a Comment (0)