యాపిల్, క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్ - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


యాపిల్, క్యారెట్, బీట్‌రూట్ తో జ్యూస్ తయారుచేసుకుని తాగడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంలోని అన్ని హానికరమైన టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో ఇది సహాయపడుతుంది. కాలేయం, మూత్రపిండాలు, ప్రేగుల నుండి వ్యర్ధాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ రసం శరీరంలోని మురికిని తొలగించి ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుంది. ఈ జ్యూస్ మన శరీర అవయవాలను డిటాక్సిఫై చేయడంల రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి, శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో సహాయపడుతుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరంలోని హిమోగ్లోబిన్ స్థాయిని పెంచే ఎర్రరక్తకణాల ఉత్పత్తిని కూడా పెంచుతుంది. తక్కువ కేలరీల ఉండే ఈ పానీయం బరువు తగ్గాలనుకునే వారికి చాలా మంచిది. ఈ పానీయంలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీవక్రియను పెంచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.


Post a Comment

0Comments

Post a Comment (0)