హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేస్ రద్దు !

Telugu Lo Computer
0

వచ్చే నెలలో హైదరాబాద్‌ వేదికగా జరగాల్సిన ఫార్ములా-ఈ ప్రిక్స్ రేస్‌ రద్దయింది. రాష్ట్రంలో గత ప్రభుత్వం తమతో చేసుకున్న కాంట్రాక్ట్‌ను కొత్తగా ఏర్పాటైన సర్కారు ఉల్లంఘించిందని ఫార్ములా- ఈ ప్రిక్స్ రేసును నిర్వహించే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ (ఎఫ్ఐఏ) సంస్థ ఆరోపించింది. దీనిపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెలవప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌(ఎంఏయూడీ)కు నోటీసులు ఇస్తున్నట్టు ప్రకటించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి10న సిటీలో రేస్‌ జరగాల్సి ఉంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులతో చర్చలు జరిపిన తర్వాత గతేడాది అక్టోబర్ 30న చేసుకున్న ఒప్పందానికి ప్రభుత్వం కట్టుబడకపోవడంతో రేస్‌ను రద్దు చేయాల్సి వచ్చిందని ఎఫ్ఐఏ తెలిపింది. నోటీసులు ఇచ్చి, చట్టపరంగా ముందుకెళ్తామని తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)