లోక్‌సభ సీట్ల పంపకంపై కాంగ్రెస్, ఆప్ భేటీ

Telugu Lo Computer
0


రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, ఆప్ సోమవారం కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. ఢిల్లీ, పంజాబ్‌లలో లోక్‌సభ సీట్ల పంపకం ప్రధాన అజెండాగా సాగిన ఈ సమావేశంలో హస్తం పార్టీ తరపున ముకుల్ వాస్నిక్, అశోక్ గెహ్లాట్, మోహన్ ప్రకాశ్, అరవిందర్ సింగ్ లవ్లీ హాజరు కాగా  ఆప్ తరపున అతిశి, సౌరభ్ భరద్వాజ్, సందీప్ పాఠక్ పాల్గొన్నారు. సీట్ల పంపకానికి సంబంధించి భవిష్యత్తులోనూ చర్చలు జరుగుతాయని ఇరు పార్టీల నేతలు తెలిపారు. కాగా ఢిల్లీలో 7 లోక్‌సభ స్థానాలు, పంజాబ్‌లో 13 నియోజకవర్గాలు ఉన్నాయి. కాగా బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యమని చెబుతున్న ఈ రెండు పార్టీలు విభాగాల ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే. కాగా గతన నెలలో ఢిల్లీలో జరిగిన కూటమి నేతల చివరి సమావేశం తర్వాత వివిధ రాష్ట్రాలకు సంబంధించి వివిధ పార్టీల మధ్య సీట్ల పంపకాలపై చర్చలు ప్రారంభమయ్యాయి. సమావేశం ముగిసిన తర్వాత కాంగ్రెస్‌ నేత అశోక్‌ గెహ్లాట్‌ మాట్లాడుతూ ఇంత పెద్ద కూటమి ఏర్పడినప్పుడు రాజీ పడాల్సి ఉంటుందని, ప్రతిపక్షంలో కొన్ని త్యాగాలు తప్పివని వ్యాఖ్యానించారు. కూటమి విజయవంతమైతే ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి అధికారంలోకి రాలేరని ఆశాభావం వ్యక్తం చేశారు. సీట్ల పంపకం విషయంలో కాంగ్రెస్‌ చొరవ తీసుకుని దేశమంతటా సానుకూల సందేశాన్ని ఇస్తుందని, కూటమి విజయవంతమైతే ప్రధాని మోదీ ప్రభుత్వం ఓడిపోయినా ఆశ్చర్యం లేదన్నారు. మరో కాంగ్రెస్ నేత ముకుల్ వాస్నిక్ మాట్లాడుతూ.. చర్చలు చాలా ఫలవంతమయ్యాయని, ప్రతిపక్ష కూటమిలో కీలక భాగస్వామి అయిన ఆప్‌తో భవిష్యత్తులోనూ చర్చలు ఉంటాయని స్పష్టం చేశారు. సానుకూల వాతావరణంలో సుమారు 2 గంటలపాటు చర్చలు జరిగాయన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)