దేశంలో కొత్తగా 605 కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 605 కొవిడ్ కేసులు బయటపడగా, క్రియాశీల కేసులు 4,002 కు చేరాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ సోమవారం వెల్లడించింది. కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు, త్రిపురలో మరొకరు మొత్తం నలుగురు కొవిడ్‌తో మృతి చెందారు. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 4,44,81,341కి పెరిగింది. రికవరీ రేటు 98.81 శాతంగా నమోదైంది. ఇప్పటివరకు 220.67 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయి. డిసెంబర్ 31న 5481 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం క్రియాశీల కేసుల్లో 92 శాతం మంది ఐసొలేషన్ ద్వారానే కోలుకున్నారు. 681కి పెరిగిన జెఎన్.1 కేసులు కొవిడ్ కొత్త వేరియంట్ జెఎన్.1 కేసులు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. జనవరి 7 వరకు మొత్తం 12 రాష్ట్రాల్లో 682 జెఎన్.1 కేసులు నమోదయ్యాయని అధికార వర్గాలు సోమవారం పేర్కొన్నాయి. కర్నాటకలో 199, కేరళలో 148,మహారాష్ట్రలో 139,గోవాలో 47,గుజరాత్‌లో 36,ఆంధ్రప్రదేశ్‌లో 30,రాజస్థాన్‌లో 30, తమిళనాడులో 30,ఢిల్లీలో 21,ఒడిశాలో3,తెలంగాణలో 2,హర్యానాలో 1 కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నప్పటికీ ఆందోళన చెందవలసిన పనిలేదని, బాధితుల్లో అత్యధికశాతం ఇంటివద్ద చికిత్సతో కోలుకుంటున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఎప్పటికప్పుడు ఈ కేసులను పర్యవేక్షించాలని, ఇన్‌ఫ్లుయెంజా, శ్వాసతీసుకోవడం ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స చేయాలని, జిల్లాల వారీగా కేసుల వివరాలు అందించాలని కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెచ్చరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)