మూడు కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ !

Telugu Lo Computer
0


తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఒకేసారి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. ఐఆర్ఆర్, మద్యం, ఇసుక కేసుల్లో హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కేసులపై మీడియాతో మాట్లాడొద్దని హైకోర్టు ఆదేశించింది. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు (ఐఆర్‌ఆర్‌), ఇసుక, మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సీఐడీ చంద్రబాబుపై కేసులు నమోదు చేసింది. వీటిపై ముందస్తు బెయిల్‌ కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో చంద్రబాబు 3 పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే వాదనలు ముగిసిన నేపథ్యంలో హైకోర్టు నేడు తన నిర్ణయాన్ని ప్రకటించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)