హైదరాబాద్‌లో బీసీసీఐ అవార్డుల ఫంక్షన్ !

Telugu Lo Computer
0


భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తన వార్షిక అవార్డుల కార్యక్రమాన్ని జనవరి 23న హైదరాబాద్‌లో జరపనుంది.  ఈ వేడుకలకు భారత జట్టుతో పాటు ఇంగ్లండ్ ప్లేయర్స్ కూడా హాజరుకానున్నారు. 5 టెస్టుల సిరీస్‌లో భాగంగా జనవరి 25 నుంచి ఉప్పల్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది. బీసీసీఐ అవార్డుల వేడుక సమయానికి ఇంగ్లండ్ ప్లేయర్స్ హైదరాబాద్‌లోనే ఉండనున్న నేపథ్యంలో వారిని కూడా బీసీసీఐ ఆహ్వానించనుంది. చివరిసారిగా బీసీసీఐ అవార్డుల ఫంక్షన్ 2020 జనవరిలో జరిగింది. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ఈ వేడుక నిలిచిపోయింది. 2018-19 క్రికెట్ ఏడాదికి గానూ అవార్డులను 2020లో బీసీసీఐ అందజేసింది. జస్ప్రీత్ బుమ్రా, పూనమ్ యాదవ్ 2020లో పాలీ ఉమ్రిగర్ అవార్డు అందుకోగా.. కృష్ణమాచారి శ్రీకాంత్, అంజుమ్ చోప్రాలు సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లు పాలీ ఉమ్రిగర్ అవార్డుకు ఎంపికవుతారన్న విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)