గాజాలో అల్‌-ఇస్రా వర్సిటీ పేల్చివేత

Telugu Lo Computer
0


గాజాలోని ప్రముఖ అల్‌-ఇస్రా యూనివర్సిటీపై ఇజ్రాయెల్‌ బాంబుదాడి చేసింది. దీంతో యూనివర్సిటీ ప్రధాన భవనం నామరూపాలు లేకుండా పోయింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో అమెరికా స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఇజ్రాయెల్‌ను కోరింది. ఈ దాడిపై యూనివర్సిటీ అధికారులు స్పందిస్తూ తొలుత వర్సిటీలోని విలువైన వస్తువులను ఇజ్రాయెల్‌ సైనికులు దోచుకున్నారని తెలిపారు. అనంతరం బాంబులతో భవనాన్ని పేల్చివేశారని చెప్పారు. ఇప్పటికే గాజాలోని కీలకమైన వైద్య, విద్యా సంస్థలను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్‌ ఇప్పుడు అల్‌-ఇస్రాను కూడా నేలమట్టం చేసిందని ధ్వజమెత్తారు.

Post a Comment

0Comments

Post a Comment (0)