అయోధ్య పేరుతో అమెజాన్‌ లో నకిలీ ప్రసాదం !

Telugu Lo Computer
0


మెజాన్‌కు కేంద్రం నోటీసులు జారీ చేసింది. అయోధ్య రామమందిరం పేరిట నకిలీ ప్రసాదం అమ్మకాలు చేపట్టిందన్న ఆరోపణలతో అమెజాన్‌కు కేంద్రం నోటీసులు ఇచ్చింది. అయోధ్యలో ఈ నెల 22న ప్రాణప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా అమెజాన్ సంస్థ ఆన్‌లైన్‌లో అయోధ్య రామమందిరం పేరిట నకిలి ప్రసాదాన్ని విక్రయిస్తోందని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్ ఇండియా ట్రేడర్స్‌ ఫిర్యాదు చేయడం జరిగింది. సాధారణ లడ్డూ ప్రసాదాన్ని 'శ్రీ రాం మందిర్ అయోధ్య ప్రసాదం' పేరుతో ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారని ఆరోపణలు చేయడం జరిగింది. తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్నారంటూ అమెజాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఏఐటీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ అమెజాన్‌కు నోటీసులు పంపింది. నోటీసులు అందిన వారం రోజుల్లోగా స్పందించాలని, లేకపోతే వినియోగదారుల రక్షణ చట్టం 2019 కింద చర్యలు తీసుకుంటానమని అమెజాన్‌కు హెచ్చరికలు జారీ చేసింది. ఈ నోటీసులపై వెంటనే అమెజాన్ స్పందించడం జరిగింది. సీసీపీఏ నుంచి నోటీసులు అందాయని, ఆయా సెల్లర్లపై తమ విధానాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని అమెజాన్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఈ మేరకు సెల్లర్ల సేల్స్ ఆప్షన్‌ను కూడా తొలగించినట్టు ఆయన వివరించారు. అయోధ్య రామమందిర ఉత్సవ నేపథ్యంలో కొందరు వ్యాపారులు దానికి కూడాసొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో శ'శ్రీరామ్‌ మందిర్‌ అయోధ్య ప్రసాద్‌', 'రఘుపతి ఘీ లడ్డూ', 'అయోధ్య రామ్‌ మందిర్‌ ప్రసాద్‌', 'ఖోయా ఖోబీ లడ్డూ', 'రామ్‌ మందిర్ అయోధ్య ప్రసాదం- దేశీ ఆవు పేడా వంటి పేర్లతో అయోధ్య రామమందిర ప్రసాదాన్ని విక్రయిస్తున్నారు. కేంద్రం నుంచి నోటీసులు అందుకోగానే అమెజాన్ వాటీ సేల్స్‌ను ఆపివేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)