జైలులో గ్యాంగ్‌స్టర్ మణి రాణా బర్త్ డే వేడుక ?

Telugu Lo Computer
0

పంజాబ్‌లోని లూథియానా జిల్లా సెంట్రల్ జైల్లో పోలీసు అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో చెప్పేందుకుఈ ఒక్క వైరల్ వీడియో ఒక ఉదాహరణ. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ మణి రాణా పుట్టినరోజును ఖైదీలు మందు విందుతో చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు. ఖైదీలు ప్లేట్లు పట్టుకుని పొడవాటి వరుసలో కూర్చున్నారు. అంతేకాకుండా దీన్నంతా ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో వదిలారు. ఇదంతా 15 రోజుల క్రితం జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో... ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీస్ శాఖ 15 మంది ఖైదీలపై కేసు నమోదు చేసింది. ఇలాంటి ఘటనలు మొదటిసారి కాదు, గతంలో కూడా చోటుచేసుకున్నాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)