మోడల్ దివ్య పహుజా దారుణ హత్య

Telugu Lo Computer
0

గురుగ్రామ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. దివ్య పహుజా అనే 27 ఏళ్ల మోడల్ హత్యకు గురైంది. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ బూటకపు ఎన్‌కౌంటర్‌ కేసులో ఏడేళ్ల జైలుశిక్ష తర్వాత ఇటీవల బెయిల్‌పై బయటకొచ్చిన ఆమెను బుధవారం ఒక హోటల్‌లో కాల్చి చంపేశారు. ఆ హోటల్ యజమాని అభిజీత్ సింగ్ ఆమెను కాల్చి చంపినట్టు తేలింది. దివ్యను హతమార్చిన తర్వాత ఆమె మృతదేహాన్ని మాయం చేసేందుకు నిందితుడు ప్రయత్నించాడు. ఇందుకు హోటల్‌లో పని చేసే హేమ్‌రాజ్, ఓంప్రకాష్‌లు సహకరించారని తేలింది. ఈ హత్య సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి నిందితుడు అభిజీత్‌తో పాటు అతనికి సహకరించిన ఆ ఇద్దరు వ్యక్తుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. తనతో సన్నిహితంగా గడిపిన ఫోటోలను చూపించి దివ్య బెదిరింపులకు పాల్పడిందని, తన వద్ద నుంచి ఇప్పటికే చాలా డబ్బులు గుంజిందని అభిజీత్ పేర్కొన్నాడు. ఇప్పటికీ ఆ ఫోటోల్ని అడ్డం పెట్టుకొని తనని బెదిరిస్తుండటంతో ఆమెను హతమార్చానని అభిజీత్ ఆరోపించాడు. అయితే దివ్య కుటుంబం మాత్రం ఈ ఆరోపణల్ని తోసిపుచ్చింది. మరోవైపు పోలీసులు దివ్య పహుజా మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)