నిలకడగా ఉన్న బంగారం ధరలు !

Telugu Lo Computer
0


కొత్త ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు ధరలు పెరుగకపోవడం కాస్త ఊరట కల్గించే అంశంగా చెప్పవచ్చు. సాధారణంగా బంగారం ధరలు పెరుగు,తగ్గుదలకు అంతర్జాతీయంగా డాలర్ విలువ ప్రదాన కారణం. ఇది ప్రతి రోజు పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. దీంతో పాటూ ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్దం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పైగా అంతర్జాతీయ మార్కెట్ ద్రవ్యోల్భణంలో వచ్చిన మార్పులు, విదేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంధ్యం, రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గులు ఇవన్నీ వెరసి బంగారు ధరలు స్థిరంగా కొనసాగేందుకు కారణం అవుతోంది. నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర రూ. 63,270 కాగా ఈరోజు కూడా రూ. 63,270 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 58,000 ఉండగా ఈరోజు రూ.58,000 గా కొనసాగుతోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)