బంగ్లాదేశ్‌ పీఠంపై మరోసారి షేక్‌ హసీనా !

Telugu Lo Computer
0


బంగ్లాదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని షేక్‌ హసీనానేతృత్వంలోని అవామీ లీగ్‌ పార్టీకి మెజారిటీ లభించింది. ప్రధాన ప్రతిపక్షం బీఎన్‌పీ సహా దాని మిత్రపక్షాలు ఈ ఎన్నికలను బహిష్కరిస్తూ దూరంగా ఉన్నవేళ అవామీ లీగ్‌ మూడింట రెండొంతుల స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 300 సీట్లలో 299 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్‌ 200సీట్లను కైవసం చేసుకొని వరుసగా నాలుగోసారి అధికారంలోకి వచ్చేందుకు సిద్ధమైంది. గోపాల్‌గంజ్‌-3 నుంచి పోటీ చేసిన ప్రధాని హసీనా 2,49,965 ఓట్లు సాధించారు. తన సమీప ప్రత్యర్థి బంగ్లాదేశ్‌ సుప్రీం పార్టీకి చెందిన నిజాముద్దీన్‌ లష్కర్‌కు కేవలం 469 ఓట్లు మాత్రమే వచ్చాయి. 1986 నుంచి ఈ స్థానంలో షేక్‌ హసీనా వరుసగా ఎనిమిదో సారి గెలవడం గమనార్హం.

Post a Comment

0Comments

Post a Comment (0)