హేమంత్ సోరెన్ రాజీనామా !

Telugu Lo Computer
0


ఝార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్‌ రాధాకృష్ణన్‌కు అందజేశారు. కొత్త ముఖ్యమంత్రిగా చంపై సోరెన్‌ పేరును ప్రతిపాదించినట్లు ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేశ్ ఠాకూర్ తెలిపారు. చంపై సోరెన్‌ను శాసనసభాపక్ష నేతగా కూటమి ఎన్నుకోబోతుందని ఆయన వెల్లడించారు. అలాగే చంపై సోరెన్ ప్రమాణస్వీకారానికి సమయం ఇవ్వాలని గవర్నర్‌ను కోరనున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ విచారణ ఎదుర్కొంటున్నారు. బుధవారం మధ్యాహ్నం నుంచి 6 గంటలకు పైగా విచారణ కొనసాగుతోంది. ఈడీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. విచారణ కార్యాలయం దగ్గర భారీ పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఏ క్షణంలోనైనా సోరెన్ అదుపులోకి తీసుకునే ఛాన్సుందని సమాచారం.

Post a Comment

0Comments

Post a Comment (0)