మార్చి 31 వరకు ఆధార్ కార్డు ఫ్రీ అప్‌డేట్ గడువు పొడిగింపు !

Telugu Lo Computer
0

ధార్ అప్‌డేట్ గడువు తేదీని ప్రభుత్వం ఇప్పుడు మరోసారి పొడిగించింది. గత పదేళ్లుగా ఆధార్ కార్డు అప్‌డేట్ చేయని వారికి ఇదొక మంచి అవకాశం. ఎలాంటి ఫీజు లేకుండా ఆధార్ కార్డును అప్‌డేట్ చేయించుకోవచ్చు. ఈ సారి గడువు తేదీని 31 మార్చి 2024 వరకూ పొడిగించారు. ఈ సమయంలో అడ్రస్, పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, ఫోటో, బయోమెట్రిక్ వంటి వివరాల్ని ఎలాంటి ఫీజు లేకుండా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డుల్ని అప్‌డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ విజ్ఞప్తి చేస్తోంది. మరీ ముఖ్యంగా గత పదేళ్లుగా ఆధార్ కార్డు సమాచారాన్ని లేదా బయోమెట్రిక్ వివరాలు అప్‌డేట్ చేయనివారి కోసం యూఐడీఏఐ విజ్ఞప్తి జారీ చేసింది. ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ తప్పకుండా సమర్పించాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా ఎవరికి వారు మై ఆధార్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. లేదా సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్లి అప్‌డేట్ చేసుకోవచ్చు. అయితే ఇందుకోసం ముందుగా https://myaadhaar.uidai.gov.in/.అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి, మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ నమోదు చేసి ధృవీకరించుకోవాలి. అప్‌డేట్ ఆధార్ ఆన్‌లైన్ ప్రక్రియను ఎంచుకోవాలి. ప్రొసీడ్ టు అప్‌డేట్ ఆధార్ కార్డులో కావల్సిన వివరాలు నమోదు చేసుకోవాలి. మీ అప్‌డేట్ స్టేటస్ చెక్ చేసేందుకు 14 నెంబర్ల యూఆర్ఎన్ నెంబర్ సిద్ధంగా ఉంచుకోవాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)