మైగ్రేన్‌ ఎందుకు వస్తుందంటే....?

Telugu Lo Computer
0


నిద్ర, భావోద్వేగాలు, ఒత్తిడి, శక్తి స్థాయిని విశ్లేషించడం ద్వారా మైగ్రేన్‌ తలనొప్పి రాకను ముందే కనిపెట్టవచ్చని అమెరికా జాతీయ మానసిక ఆరోగ్య సంస్థ పరిశోధకులు తేల్చారు. ఏ రాత్రి అయినా సరిగా నిద్రపట్టలేదని చెప్పినవారిలో 22 శాతం మందికి, మగత నిద్ర పోయామని చెప్పినవారిలో 18 శాతం మందికి మరుసటి రోజు ఉదయం మైగ్రేన్‌ వచ్చిందని పరిశోధకులు తెలిపారు. ఫలానా రోజు శక్తి క్షీణించినట్లు అనిపించిందని చెప్పిన వారిలో 16 శాతం మంది మర్నాడు మైగ్రేన్‌కు లోనయ్యారు. తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనా, సాధారణం కన్నా ఎక్కువ చురుగ్గా ఉన్నా మర్నాడు మధ్యాహ్నం లేదా సాయంత్రం ఈ రుగ్మత బారినపడినట్లు 17 శాతం మంది చెప్పారు. వారిలో ఒత్తిడి, మానసిక భావోద్వేగాలు, శక్తి, తలనొప్పుల సమాచారాన్ని రోజులో నాలుగుసార్లు చొప్పున రెండువారాల పాటు మొబైల్‌ యాప్‌ ద్వారా సేకరించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)