దేశంలో బీఏలోనే ఎక్కువ మంది విద్యార్థులు !

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా ఆర్ట్స్ కోర్సుల క్రేజ్ కొనసాగుతోంది. డిగ్రీ, పీజీలోనూ ఇదే ట్రెండ్ నడుస్తోంది. యూజీ లెవెల్​లో బీకాం, బీఎస్సీతో పోలిస్తే బీఏలోనే స్టూడెంట్లు భారీగా చేరుతున్నారు. 2021-22 విద్యాసంవత్సరంలో రెగ్యులర్ మోడ్​లో బీఎస్సీలో 47,23,925 మంది, బీకాంలో 38,72,487 మంది చదివితే, బీఏను మాత్రం ఏకంగా 90,43,884 మంది చదివారు. కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏఐఎస్​హెచ్ఈ) చేసిన 2021-22 సర్వే రిపోర్టు తాజాగా విడుదలైంది. ఈ సర్వేలో దేశంలోని 1,162 వర్సిటీలు, 45,473 కాలేజీలు ఉండగా, 42,825 కాలేజీలు సర్వేలో పాల్గొన్నట్టు అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 4.33 కోట్ల మంది ఉన్నత విద్యను చదువుతున్నారని, ఇందులో 15.3 %ఎస్సీలు, 6.3% ఎస్టీలు, 37.8% బీసీలు ఉన్నారని పేర్కొన్నారు2017-18లో బీఏలో 78.54 లక్షల మంది చేరగా, 2021-22లో ఆ సంఖ్య 90.43 లక్షలకు పెరిగింది. బీఎస్సీలో మాత్రం 45.97 లక్షల మంది నుంచి 47.23 లక్షలకు చేరింది. బీటెక్​లో 2017-18లో 39.40 లక్షల మంది చేరితే, 2021-22లో 38.45 లక్షలకు తగ్గింది. బీఫార్మసీలో 2.25 లక్షల నుంచి 4.51 లక్షలకు పెరిగింది. ఎంబీబీఎస్​లో 2.41 లక్షల నుంచి 3.20 లక్షలకు చేరింది. ఎంఏలో 2017-18లో 9.01లక్షల మంది చేరితే, 2021-22లో 11.40 లక్షల మంది చేరారు. ఎంకామ్​లో 4.21లక్షల నుంచి 5.25 లక్షలకు, ఎంఎస్సీ 6.05 లక్షల నుంచి 8.34 లక్షలకు పెరిగింది. డిస్టెన్స్ మోడ్​లోనూ బీఏ, ఎంఏలోనే ఎక్కువ మంది చదువుతున్నారు. బీఏలో 19,46,123 మంది, బీఎస్సీలో 2,20,782 మంది చదవగా, ఎంఏలో 8,24,709 మంది, ఎంఎస్సీలో 1,52,082 మంది చదివారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)