నిల్వ చపాతీలు - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


రాత్రి మిగిలిన చపాతీలు, రోటిలను కూడా తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట పాత చపాతీలను తినడం వల్ల అనేక సమస్యలు దూరం అవుతాయని చాలా మంది ప్రజలు నమ్ముతారు. మిగిలిపోయిన చపాతిని చల్లటి పాలలో చూర్ణం చేసి ఉదయం పూట తింటే అధిక రక్తపోటు ఉన్న వారికి  ఎంతో మేలు చేస్తుంది. ఉదయాన్నే చల్లని పాలు తాగడం రక్త పోటు అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. షుగర్ పేషంట్స్ వీటిని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. చద్ది చపాతీలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫైబర్ పొట్టను ఎక్కువగా నిండుగా ఉండేలా చేస్తుంది. దీనితో ఎక్కువ తినాలనిపించదు. మలబద్ధకంతో జీర్ణ క్రియ సమస్యలు ఏర్పడుతాయి. ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్న వారు రాత్రి చపాతీలు తినడం వల్ల జీర్ణ క్రియ సమస్యలు నయం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో రాత్రి చపాతీలను చేర్చుకోవడం ఎంతో మంచిది. ఇది మీ సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. చాలా ఎనర్జీగా ఉండటంతో పాటుగా అనేక సమస్యలు దూరం అవుతాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)