ఇండియా కూటమి నుంచి నితీష్ కుమార్ వైదొలిగే అవకాశం ?

Telugu Lo Computer
0


నితీష్ కుమార్ భారత్ కూటమి నుంచి వైదొలిగే అవకాశం ఉందని బీహార్ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో పాటు మహాఘటబంధన్ కూటమి నుంచి కూడా బీహార్ తప్పుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాత మిత్రుడు బీజేపీతో జతకట్టే అవకాశం ఉందని పలు వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతున్న 'భారత్ జోడో న్యాయ యాత్ర'లో కూడా నితీష్ కుమార్ పాల్గొనవద్దని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే ఆర్జేడీ, జేడీయూల మధ్య పొసగడం లేదు. వంశపారంపర్య రాజకీయాలపై సీఎం నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత లాలూ కుమార్తె రోహిణి ఆచార్య ఘాటుగా స్పందించారు. దీంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. రోహిణి చేసిన ట్వీట్ గురించి నితీష్ కుమార్ సమాచారం కోరారని, ఆర్జేడీతో పొత్తుకు స్వస్తి పలికి, పదవి నుంచి వైదొలిగి, బీహార్ అసెంబ్లీ రద్దుకు కూడా సిఫారసు చేసే అవకాశం ఉందని జేడీయూ వర్గాలు తెలిపాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)