ఐఆర్‌సీటీసీ కొత్త మార్గదర్శకాలను జారీ !

Telugu Lo Computer
0


ప్రయాణికులు రైలు టిక్కెట్‌లను సులభంగా, దుర్వినియోగానికి గురి కాకుండా బుక్‌ చేసుకోవడానికి వీలుగా ఐఆర్‌సీటీసీ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసే ప్రయాణికులు ముందుగా వారి ఫోన్ నంబర్, ఈమెయిల్ అడ్రస్‌ను ధ్రువీకరించాల్సి ఉంటుంది. మొదటగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌లో వెరిఫికేషన్‌ విండోకు లాగిన్ చేయండి తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీని నమోదు చేయండి. హోమ్ పేజీలో అవసరమైన సమాచారాన్ని అందించిన తర్వాత వెరిఫై బటన్‌పై క్లిక్ చేసిన తరువాత మొబైల్‌కి ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసి మీ మొబైల్ నంబర్‌ని ధృవీకరించండి. ఇక ఈమెయిల్ వెరిఫికేషన్‌ పూర్తి చేయడానికి ముందుగా మీ ఈమెయిల్ ఐడీకి వచ్చిన కోడ్‌ను నమోదు చేయండి. ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆన్‌లైన్ రైలు టిక్కెట్ బుకింగ్‌లు చేయగలుగుతారు.


Post a Comment

0Comments

Post a Comment (0)