ఫిబ్రవరిలో కేంద్ర మంత్రులు ఎవరూ అయోధ్యకు వెళ్లొద్దని ప్రధాని ఆదేశాలు ?

Telugu Lo Computer
0


యోధ్యలో ప్రాణ ప్రతిష్ట తర్వాత దేశంలోని నలుమూలల నుంచి భక్తులు రాముడిని  సందర్శించేందుకు వస్తున్నారు. అయితే ఒక వేళ కేంద్ర మంత్రులు వెళ్తే ప్రోటోకాల్ సమస్యలతో భక్తులకు ఇబ్బందులు తలెత్తుతాయని కేంద్ర మంత్రులు ఫిబ్రవరి నెలలో అయోధ్యకు వెళ్లొద్దని ప్రధాని కోరినట్లు తెలుస్తోంది. మార్చి నెలలో కేంద్రమంత్రులు అయోధ్య రామ మందిర సందర్శనకు వెళ్తారని పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో, అయోధ్య రామ మందిరంపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయని ప్రధాని మంత్రుల్ని అడిగారని తెలుస్తోంది. సోమవారం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో అయోధ్యలో భవ్య రామ మందిరం ప్రారంభమైంది. సాధారణ ప్రజల కోసం మంగళవారం నుంచి దర్శనాలు మొదలయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు రాముడిని దర్శించుకునేందుకు బారులు తీరారు. భక్తులు భారీ సంఖ్యలో రావడంతో దర్శనానికి కాసేపు విరామం ఇవ్వాల్సి వచ్చింది. భక్తుల రద్దీ దృష్ట్యా అయోధ్యలోకి అన్ని వాహనాల ఎంట్రీపై అధికారులు నిషేధం విధించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)