భోజనానికి సమయపాలన అతి ముఖ్యం !

Telugu Lo Computer
0


నిషి ఆరోగ్యంగా ఉండేందుకు ఉదయం తినే అల్పాహారం చాలా ముఖ్యం. అలాగే మధ్యాహ్నం, రాత్రి భోజనాలకు సమయపాలన ఉండాలి. ఇవి గుండె ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపిస్తాయని అంటున్నారు నిపుణులు. కాబట్టి బ్రేక్ ఫాస్ట్, భోజనం తినడానికి ఒక సమయం ఖచ్చితంగా కావాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఏ సమయానికి తింటే మంచిదో తాజాగా జరిగిన అంతర్జాతీయ అధ్యయనం సూచిస్తుంది. అదే విధంగా ఏ సమయానికి తింటే మంచిదో వివరిస్తోంది. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ తినడంలో అలసత్వం కారణంగా గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతున్నట్టు ఈ అధ్యయనం చెబుతుంది. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. రోజులో మీరు తినే మొదటి భోజనం మీ గుండెపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఫ్రాన్స్‌కు చెందిన పరిశోధనా బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. లక్ష మందిపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. భోజనం తినడం లేట్ అవుతున్న కొద్దీ గుండె కొట్టుకునే వేగంలో కూడా మార్పులు ఉంటున్నాయని, ఇది హృదయ సంబంధ వ్యాధులకు కూడా కారణం అవుతున్నట్లు వెల్లడించారు. రక్త పోటులో హెచ్చుతగ్గులు, గుండె లయ మారడం, స్ట్రోక్, హార్ట్ ఒక్కసారిగా ఆగిపోవడం వంటివి పెరుగుతాయి. ఉదయం అల్పాహారం ఆలస్యం అయ్యే కొద్దీ గంటకు 6 శాతం గుండె పోటు వచ్చే అవకాశాలు ఉన్నాయట. అందుకే ప్రతి రోజూ సమయానికి తినాలి. ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు బ్రేక్ ఫాస్ట్ తినడం అలవాటు చేసుకుంటే గుండె వ్యాధులు రాకుండా జాగ్రత్త పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగి పోతుంది. డబ్ల్యూహెచ్వో చెబుతున్న లెక్కల ప్రకారం.. ప్రతి సంవత్సరం కోటి డబ్బై లక్షల మందికి.. గుండె జబ్బులతో మరణిస్తున్నట్టు వెల్లడించింది. అదే విధంగా మధ్యాహ్నం భోజనం కూడా ఒంటి గంటలోపు తినేయాలట. అలాగే రాత్రి 7:30 లోపు ముగిస్తే మంచిది. రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేసే అలవాటు ఉన్నవారిలో గుండె సమస్యలు పెరిగిపోయే అవకాశం ఎక్కువ ఉందని పరిశోధకులు తెలిపారు. ఇలా తినే సమయం పెరుగుతున్నకొద్దీ.. శరీరంలో అనేక మార్పులు చోట చేసుకుంటాయని దీని వల్ల వ్యాధులు త్వరగా వచ్చే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)