దర్శనమిచ్చిన మకరజ్యోతి !

Telugu Lo Computer
0


కర సంక్రాంతి పర్వదినమైన సోమవారం సాయంత్రం 6.47 గంటలకు కేరళలోని శబరిమల ఆలయానికి సమీపంలోని పొన్నాంబళమేడుపై మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. మొత్తం మూడుసార్లు జ్యోతి దర్శనమిచ్చింది. జ్యోతి దర్శనమిచ్చిన సందర్భంగా శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమోగాయి. జ్యోతి దర్శనానికి 50 వేల మంది భక్తులకు ట్రావెన్‌కోర్‌ బోర్డు అనుమతిచ్చినప్పటికీ సుమారు 4 లక్షల మంది ప్రత్యక్షంగా జ్యోతిని వీక్షించారు. భక్తులు జ్యోతిని దర్శించుకునేందుకు ట్రావెన్‌కోర్‌ ఆలయ బోర్డు ప్రత్యేక వ్యూ పాయింట్లు ఏర్పాటు చేసింది. పరోక్షంగా టీవీలు, యూ ట్యూబ్‌లో కొన్ని కోట్ల మంది జ్యోతి దర్శనం చేసుకున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)