హమాస్‌ బలగాలను పాలస్తీనా వెలుపల చంపండి !

Telugu Lo Computer
0


గాజా - ఇజ్రాయెల్‌ మధ్య దాడులు మొదలై 100 వంద రోజులు పూర్తి అయింది. అయినా ఇజ్రాయెల్‌ గాజాపై దాడులను మరింత తీవ్రతరం చేస్తూనే ఉంది. హమాస్‌ను అంతమొందించడమే లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌ దేశ అర్మీ ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (ఐడీఎఫ్‌) తాజాగా ఓ వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో హమాస్‌ మిలిటెంట్లపై పాలస్తీనియా ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ''హమాస్‌ నేతలు కుక్కలతో సమానం. వారిని అల్లా క్షమించడు. హమాస్‌ నేతల వల్లనే తమకు ఈ దారుణ పరిస్థితి ఏర్పడింది. మమ్మల్ని వారు వందేళ్ల వెనక్కి నెట్టారు. సాయుధ బలంతో హమాస్‌ నేతలు విర్రవీగుతున్నారు. హమాస్‌ నేతలు గాజాలో లేరు. వారంతా పాలస్తీనా విడిచిపెట్టి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. కావాలంటే హమాస్‌ బలగాలను పాలస్తీనా వెలుపల చంపండి. కానీ, గాజాలోని పాలస్తీనా ప్రజలపై దాడులు చేయకండి'' అని గాజాలోని పాలస్తీనా ప్రజలు ఇజ్రాయెల్‌ సైనిక అధికారులతో మొర పెట్టుకున్నారు. ఇప్పటివరకు 23,968 మంది పాలస్తీనియా ప్రజలు మృత్యువాత పడ్డారు. ఇక.. అక్టోబర్‌ 7న హమాస్‌ సాయుధులు చేసిన మెరుపు దాడుల్లో ఇజ్రాయెల్‌కు చెందిన 1200 మంది మృతి చెందారు. హమాస్‌ నేతల చేతిలో ఇంకా 136 మంది ఇజ్రాయెల్‌ బంధీలు ఉన్న విషమం తెలిసిందే.


Post a Comment

0Comments

Post a Comment (0)