దేశంలోని ప్రతి మారు మూలకు మోడీ కీ గ్యారెంటీ చేరుకుంటోంది !

Telugu Lo Computer
0


పేదలు, రైతులు, మహిళలు, యువజనులు సాధికారత సాధించిన నాడే భారత్ సాధికారతను సాధించినట్లవు తుందని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. సోమవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వికసిత భారత్ సంకల్ప యాత్రనుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ అర్హులైన ప్రభుత్వ పథకాల లబ్ధిదాలందరినీ గుర్తించేలా చూడడమే ఈ యాత్ర ప్రధాన లక్షమని చెప్పారు. వికసి భారత్ సంకల్ప యాత్ర పేదల ఆరోగ్యానికి సంజీవనిగా మారిందని ఆయన తెలిపారు. ఈ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఉచిత ఉజ్వల గ్యాస్ కనెక్షన్ల కోసం కొత్తగా 12 లక్షల ఉజ్వల యోజన లబ్ధిదారులు దరఖాస్తులు అందచేశారని మోడీ పేర్కొన్నారు. మోడీ కీ గ్యారెంటీ వాహనం దేశంలోని మారుమూల ప్రాంతాన్ని చేరుకుంటోందని, దేశంలోని ప్రతి గ్రామంలోని ప్రజల ముంగిట వద్దకు అధికారులు, రాజకీయ నాయకులు వస్తారని ఎవరు ఊహించగలరని ప్రధాని ప్రశ్నించారు. దేశంలోనే కాక ప్రపంచంలోనే మోడీ గ్యారెంటీలపై చర్చ జరుగుతోందని ప్రధాని అన్నారు. ముంబైలాంటి మెట్రో నగరమైనా మిజోరంలోని చిన్న పల్లె అయినా దేశంలోని ప్రతి మారు మూలకు మోడీ కీ గ్యారెంటీ చేరుకుంటోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా లబ్ధిదారులతో కూడా మోడీ ముచ్చటించారు. గత ఏడాది నవంబర్ 15న వికసిత్ బారత్ సంకల్ప యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి తరచు లబ్ధిదారులతో ప్రధాని మోడీ మాట కలుపుతూ వారి నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)