షేక్ హసీనాకు నరేంద్రమోడీ అభినందనలు !

Telugu Lo Computer
0


బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ప్రధాని షేక్ హసీనా, ఆమె పార్టీ అవామీ లీగ్ చారిత్రాత్మక విజయం సాధించింది. ప్రతిపక్ష బీఎన్పీ పార్టీలో పాటు ఇతర పార్టీలు ఈ ఎన్నికలను బహిష్కరించిన నేపథ్యంలో షేక్ హసీనాకు తిరుగు లేకుండా పోయింది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో గెలిచి నాలుగోసారి ప్రధాని కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఫోన్ చేశారు. వరసగా నాలుగోసారి ఎన్నికల్లో గెలిచినందుకు అభినందనలు తెలియజేశారు. ''బంగ్లాదేశ్‌తో మా శాశ్వత మరియు ప్రజల-కేంద్రీకృత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము'' అని పీఎం మోడీ చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)