టీటీడీ అధికారిక వెబ్ సైట్ పేరు మరోసారి మార్పు !

Telugu Lo Computer
0


తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి సంబంధించిన వివరాలను తెలియజేసే అధికారిక వెబ్ సైట్ పేరు మరోసారి మారినట్లు ప్రకటించింది. గతంలో tirupatibalaji.ap.gov.in అని ఉన్న టిటిడీ వెబ్ సైట్ పేరు ఇప్పుడు ttdevasthanams.ap.gov.inగా మార్పు చేశారు. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించాల్సిందిగా టిటిడీ విజ్ఞప్తి చేసింది. తిరుపతి, ఇతర ప్రాంతాలలో ఉన్న టీటీడీ అనుబంధ ఆలయాలుతో పాటు హిందూ ధర్మానికి విస్తృత ప్రాచుర్యం కల్పించేదిశగా అన్ని వివరాలతో కొత్త వెబ్‌సైట్‌ ttdevasthanams.ap.gov.in ను టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రారంభించారు. ఆలయానికి సంబంధించిన అధికారిక వెబ్ సైట్ పేరు మార్పుని వన్ ఆర్గనైజేషన్, వన్ వెబ్‌సైట్, వన్ మొబైల్ యాప్'లో భాగంగా మార్చినట్లు వెల్లడించింది. ఇక నుంచి శ్రీవారి భక్తులు ఆన్‌లైన్ బుకింగ్ ను ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ ద్వారా చేసుకోవాల్సిందిగా సూచించారు. స్వామివారి భక్తులకు అన్ని సౌకర్యాలు ఒకే చోట లభించే విధంగా వెబ్ సైట్ పేరుని మారుస్తూ టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే సంస్థ, ఒకే వెబ్‌సైట్, ఒకే మొబైల్ యాప్ ఉండాలన్న నిర్ణయంతో పేరుని మార్చినట్లు ప్రకటించింది. ఇక పై భక్తులు శ్రీవారి దర్శనం కోసం లేదా ఆలయ వివరాల కోసం ఆన్‌లైన్ లో బుక్ చేసుకోవాలనుకుంటే.. ఇక నుంచి కొత్త వెబ్‌సైట్‌ని ఉపయోగించాలని వెల్లడించింది. గతంలో టీటీడీ వెబ్ సైట్ పేరు టీటీడీ సేవా ఆన్ లైన్ అనే పేరుతో ఉండేది. అనంతరం టీటీడీ వెబ్ సైట్‌ను ప్రభుత్వానికి అనుబంధం చేస్తూ tirupatibalaji.ap.gov.in గా మార్చారు. ఇప్పుడు ఆ పేరుని కూడా మార్చి.. ttdevasthanams.ap.gov.inగా కొత్త పేరుని పెట్టారు. ఈ కొత్త వెబ్ సైట్ లో తిరుపతిలో టీటీడీ పరిధిలో ఉన్న ఆలయాలతో పాటు.. అనుబంధ ఆలయాలకు సంబంధించిన వివరాలు, చరిత్ర తో సహా శ్రీవారి దర్శన వేళలు, ఆర్జిత సేవలు, రావణా వివరాలు, బస సహా ఇతర వివరాలను భక్తులు తెలుసుకోవచ్చు. అంతేకాదు ఈ వెబ్ సైట్ ద్వారా శ్రీవారి ఆలయ విశిష్టతపై ఫొటోలు, వీడియోలను భక్తులకు అందుబాటులో ఉంచారు. జియో సంస్థ సహకారంతో టీటీడీ ఐటీ విభాగం టిటిడీ వెబ్ సైట్ ను ఆధునీకరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)