రేపటి నుంచి దక్షిణాఫ్రికా వేదికగా మినీ ఐపీఎల్‌ !

Telugu Lo Computer
0


భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌అభిమానులను అలరిస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) లో భాగంగా ఉన్న ఫ్రాంచైజీలు దక్షిణాఫ్రికా వేదికగా కూడా తలపడుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌లోని ఆరు ఫ్రాంచైజీలు (ముంబై, చెన్నై, హైదరాబాద్‌, లక్నో, ఢిల్లీ, రాజస్తాన్‌) ఐపీఎల్‌కు ముందే సఫారీ గడ్డపై మరోసారి ఢీకొనబోతున్నాయి. 2023లో సూపర్‌ సక్సెస్‌ అయిన సౌతాఫ్రికా 20 (ఎస్‌ఎ20) ఈ ఏడాది అలరించేందుకు సిద్ధమైంది. గతేడాది ఎయిడెన్‌ మార్క్‌రమ్‌ సారథ్యంలోని సన్‌ రైజర్స్‌ ఈస్ట్రన్‌ కేప్‌ విజేతగా నిలిచింది. ఈ ఏడాది జనవరి 10 నుంచి ఫిబ్రవరి 10 వరకు నెలరోజుల పాటు దక్షిణాఫ్రికాలోని ఆరు వేదికలలో జరగాల్సి ఉన్న ఈ 'మినీ ఐపీఎల్‌' వివరాలు మీకోసం తొలి సీజన్‌లో మాదిరిగానే సెకండ్‌ ఎడిషన్‌లో కూడా ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఎంఐ కేప్‌టౌన్‌ (ముంబై), డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ (లక్నో), జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ (చెన్నై), పార్ల్‌ రాయల్స్‌ (రాజస్తాన్‌), సన్‌ రైజర్స్‌ ఈస్ట్రన్‌ కేప్‌ (హైదరాబాద్‌), ప్రిటోరియా క్యాపిటల్స్‌ (ఢిల్లీ)లు తలపడబోతున్నాయి. ఆరు జట్లు ఆరు వేదికలలో మ్యాచ్‌లు ఆడనున్నాయి. న్యూలాండ్స్‌ (కేప్‌టౌన్‌), సెంచూరియన్‌ పార్క్‌ (ప్రిటోరియా), కింగ్స్‌మీడ్‌ (డర్బన్‌), సెయింట్‌ జార్జ్స్‌ పార్క్‌ (గబేరా), వాండరర్స్‌ (జోహన్నస్‌బర్గ్), బొలాండ్‌ పార్క్‌ (పార్ల్‌) వేదికలు ఎస్‌ఎ20కి ఆతిథ్యమివ్వనున్నాయి. ఐపీఎల్‌ మాదిరిగానే ఈ టోర్నీ కూడా రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలోనే జరుగుతుంది. అయితే గ్రూప్‌ స్టేజ్‌లో ఆరు జట్లు.. ఒక్కో జట్టుతో రెండు మ్యాచ్‌లు ఆడతాయి. అంటే మొత్తంగా ఒక జట్టు పది మ్యాచ్‌లు ఆడతాయి. ఇందులో ఐదు హోమ్‌ (ఇంట), ఐదు అవే (బయిట) మ్యాచ్‌లు. జనవరి 10 నుంచి ఫిబ్రవరి 4 దాకా గ్రూప్‌ స్టేజ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. ఫిబ్రవరి ఆరు నుంచి ప్లేఆఫ్స్‌ మొదలవుతాయి. ప్లేఆఫ్స్‌ కూడా క్వాలిఫయర్‌ 1, ఎలిమినేటర్‌, క్వాలిఫయర్‌ 2 పద్ధతిలోనే జరుగుతుంది. ప్లేఆఫ్స్‌లో టాప్‌-2లో నిలిచిన జట్లు ఫిబ్రవరి 10న జరుగుతుంది. ఈ టోర్నీకి సౌతాఫ్రికా క్రికెట్‌ బోర్డు ప్రైజ్‌మనీని 70 మిలియన్‌ ర్యాండ్స్‌గా (సుమారు 31 కోట్లు) ప్రకటించింది. ఇందులో విజేతకు 34 మిలియన్స్‌ (దాదాపు రూ. 15 కోట్లు), రన్నరప్‌కు 16.25 మిలియన్స్‌ (దాదాపు రూ. 7.2 కోట్లు) దక్కుతాయి. మూడో స్థానంలో నిలిచి జట్టుకు రూ. 3.9 కోట్లు, నాలుగో స్థానంలోని జట్టుకు రూ. 3.5 కోట్లు అందుతాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)