డీఎస్పీ హత్యను 48 గంటల్లో ఛేదించిన పోలీసులు

Telugu Lo Computer
0

ర్జున అవార్డు గ్రహీత, పంజాబ్‌కు చెందిన దల్బీర్‌ సింగ్‌ దేఓల్‌ (54) అనే డీఎస్పీ స్థాయి పోలీసు అధికారి హత్యకు గురికావడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక నిందితుడుని అరెస్టు చేసిన పోలీసులు హత్యకు గల కారణాలను కనుగొన్నారు. ఓ ఆటో డ్రైవర్‌తో జరిగిన వాగ్వాదమే డీఎస్పీ మృతికి కారణంగా తేల్చారు. పోలీసు ఉన్నతాధికారులు తెలిపిన వివరాల ప్రకారం పంజాబ్‌ పోలీసు ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న దల్బీర్‌ సింగ్‌ నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా స్నేహితులతో కలిసి సాయంత్రం వేళ బయటకు వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో తనను ఇంటి దగ్గర దింపమని ఓ ఆటో డ్రైవర్‌ను కోరారు. అందుకు డ్రైవర్‌ నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. అది కాస్త ఘర్షణకు దారి తీసింది. దల్బీర్‌ దగ్గర ఉన్న సర్వీస్‌ తుపాకీని లాక్కొన్న డ్రైవర్‌, అతడిపై కాల్పులు జరిపాడు. దాంతో దల్బీర్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు దర్యాప్తులో గుర్తించారు. పంజాబ్‌లోని జలంధర్‌ నగర శివారులో ఈ ఘటన చోటుచేసుకొంది. ఓ కాలువ సమీపంలో గాయాలతో పడి ఉన్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. నిందితుడిని విజయ్‌ కుమార్‌గా గుర్తించి అరెస్టు చేశారు. అతడిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇదిలాఉంటే, గతంలో జరిగిన ఆసియా క్రీడల్లో దల్బీర్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌లో బంగారు పతకాన్ని సాధించారు. 2000లో ఆయనను కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది. అనంతరం ఆయన పోలీసుశాఖలో చేరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)