దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం

Telugu Lo Computer
0


క్షిణాఫ్రికాతో కేప్‌టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచులో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో రెండు టెస్టు మ్యాచుల సిరీస్ 1-1తో సమమైంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-2025 పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. డబ్ల్యూటీసీ కొత్త సైకిల్‌లో భారత్ ఇప్పటి వరకు నాలుగు టెస్టులు ఆడింది. ఇందులో రెండు మ్యాచుల్లో గెలవగా ఓ మ్యాచులో ఓడింది. మరో మ్యాచును డ్రా చేసుకుంది. భారత్ ఖాతాలో 26 పాయింట్లు ఉండగా 54.16 విజయ శాతంతో తొలి స్థానంలో నిలిచింది. ఇక భారత్ చేతిలో ఓడిన దక్షిణాఫ్రికా రెండో స్థానానికి పడిపోయింది. ఈ సైకిల్‌లో రెండు టెస్టులు ఆడిన దక్షిణాప్రికా ఓ మ్యాచులో గెలవగా మరో మ్యాచులో ఓడిపోయింది. 12 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉన్నాయి. 50.00 విజయ శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తరువాత వరుసగా న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ దేశాలు మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)