గ్యాంగ్‌స్టర్‌పై పోలీసులు కాల్పులు

Telugu Lo Computer
0


పంజాబ్‌లోని మొహాలీ జిల్లాలో కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోతున్న గ్యాంగ్‌స్టర్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. అతడు దాచిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పలు హత్య కేసులున్న కరన్‌జిత్ సింగ్, అలియాస్ జస్సా హైబోవాల్‌ను ఈ ఏడాది నవంబర్‌లో పంజాబ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకునేందుకు జిరాక్‌పూర్ ప్రాంతంలోని ఒక పాడుబడిన భవనం వద్దకు యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం తీసుకెళ్లారు. అయితే పోలీస్‌ కస్టడీ నుంచి తప్పించుకునేందుకు జస్సా ప్రయత్నించగా అతడిపై కాల్పులు జరిపారు. బుల్లెట్‌ గాయాలైన గ్యాంగ్‌స్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఆ పురాతన భవనం నుంచి చైనా తయారీ .30 క్యాలిబర్ పిస్టల్, ఐదు లైవ్ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. గ్యాంగ్‌స్టర్ సోను ఖత్రీకి అత్యంత సన్నిహితుడైన కరన్‌జిత్ సింగ్‌కు ఆరు హత్య కేసుల్లో ప్రమేయం ఉందని చెప్పారు. పారిపోయే ప్రయత్నంలో పోలీస్‌ కాల్పుల్లో గాయపడిన అతడ్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)