తగ్గిన బంగారం వెండి ధరలు !

Telugu Lo Computer
0


దేశీయ బులియన్ మార్కెట్లో  బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారెట్స్) ధర రూ.350 తగ్గి రూ.63,950 వద్ద స్థిర పడిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. బంగారంతోపాటు కిలో వెండి ధర కూడా రూ.1000 తగ్గి రూ.78,500 వద్ద ముగిసింది. గురువారం కిలో వెండి ధర రూ.79,500 వద్ద స్థిర పడింది. ఫ్యూచర్స్ మార్కెట్.. ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి డెలివరీ తులం బంగారం ధర రూ.244 తగ్గుముఖం పట్టి రూ.63,145 వద్ద ముగిసింది. మార్చి కాంట్రాక్ట్ కిలో వెండి ధర రూ.1166 క్షీణించి రూ.73,793 వద్ద పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 2070 డాలర్లు, ఔన్స్ వెండి ధర 23.80 డాలర్లు పలుకుతున్నది. గురువారం బంగారం ధర మూడు వారాల గరిష్ట స్థాయిని తాకడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో కామెక్స్ గోల్డ్ ధర తగ్గుముఖం పట్టిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమొడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అమెరికా డాలర్, యూఎస్ ట్రెజరీ బాండ్ల విలువ మెరుగు పడటంతో బంగారం ధరలు పడిపోయాయని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)